
వివాహ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని నూతన వధు-వరులను ఆశీర్వదించారు. శనివారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామ బీఅర్ఎస్ నాయకురాలు వడ్డె భారతమ్మ కుమార్తె సునిత వివాహం అల్వాల లోని జయ విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈవివాహానికి దుబ్బాక ఎమ్మేల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆశీర్వదించిన వారిలో బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, సోలిపేట సతీష్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, తోట అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ అల్వాల రాజు, నాయకులు మహ్మద్, పిట్ల వెంకటయ్య, బండారు స్వామి గౌడ్, పులిగారి గణేష్, ఈదుగళ్ల పర్శరాములు, పాత్కుల బాలేష్, జీడిపల్లి స్వామి, కుమార స్వామి తదితరులు ఉన్నారు.