జాతీయ రహదారిపై పెంచికల్ పాడు స్టేజీ వద్ద అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలి

– దయ్యాల నరసింహ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి మండలం పరిధిలో పెంచికల్ పాడు చౌరస్తా వద్ద ఐటిఐ కాలేజీ ఎదురుగా జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జి ను ఏర్పాటు చేయాలని శనివారం సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ జాతీయ రహదారిపై పెంచికల్ పాడు మీదుగా భువనగిరి మండలం,వలిగొండ మండలం, ఆత్మకూరు మండలంలోని అనేక గ్రామాలకు ప్రజలు రవాణా చేస్తుంటారని ఇప్పటికే 45 మంది చనిపోయారన్నారు. ,అనేక ప్రమాదాలు జరుగుతున్న, అనేక సార్లు ఎంపి, ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు ఇచ్చిన ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. ఇప్పటికైనా  తక్షణమే ప్రభుత్వం స్పందించి అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. రవాణా దూరాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యుడు పెంచికలపాడు సర్పంచ్  సిల్వేరు ఎల్లయ్య, సీపీఐ(ఎం) మాజీ మండల కమిటీ సభ్యులు ,వడ్డబోయిన వెంకటేష్ ,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లావుడ్య రాజు, గ్రామస్తులు కృష్ణ ,పాశం శ్రవణ్ కుమార్, అండాలు మల్లేష్ ,నవీన్,మహేష్,అశోక్,లావణ్య  పాల్గొన్నారు.