
– కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కట్టుబడి ఉండండి..మీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటా..
– ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది
– సుల్తాన్ పేట్ గ్రామంలో మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పలువురు గ్రామస్తులు కాంగ్రెస్లో చేరిక
– జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
ఈ జుక్కల్ నియోజకవర్గానికి 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన హనుమంతు సిండే అభివృద్ధిని ప్రజా సమస్యలని పట్టించుకోని దద్దమ్మ, మద్నూర్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదు కానీ అక్రమ వసూళ్లు మాత్రం భారీగా చేశారని ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ఒక్కొక్కరి దగ్గర దాదాపు పదివేల రూపాయల వరకు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అక్రమ వసూళ్లపై క్రిమినల్ కేసులు పెట్టిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదనీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, చెప్పిన మాటకు ఒక్కొక్కటిగా మూడు నెలల కాలంలో అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామ మాజీ సర్పంచ్ బాబు పటేల్ ఉపసర్పంచ్ షేక్ సలీం, ఆ గ్రామపంచాయతీ పలువురు వార్డు సభ్యులు మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు. మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండండి. మీకు ఎలాంటి అభివృద్ధి పనులకైనా తాను అండగా నిలుస్తానని ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మద్నూర్ మండల ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం నాడు సుల్తాన్ పెట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమం అలాగే మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత చిన్న షక్కర్గా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ, ఆ తర్వాత మండలంలోని చిన్న తడగూర్ ఖరగ్ గ్రామాల్లో సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని, ఆయా గ్రామాల్లో సభలో ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వెంట స్థానిక మండల నాయకులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి ముజీబ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చెక్కులు పొందే లబ్ధిదారులు పాల్గొన్నారు.