
మండలంలోని మానిక్ బండారు సమీపంలో గల 63వ జాతీయ రహదారిపై మండల బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ దిష్టి బొమ్మను దహనం శనివారం చేశారు. ఈ సందర్భంగా బిఅర్ఎస్ మండల అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనుగు గంగాధర్, మండల నాయకులు అబిబ్, మహేష్, గంగాధర్, వేణు, కృష్ణ, గణపతి తదితరులు పాల్గొన్నారు.