బురుజులు కూల్చాలి.. ఆ మట్టిని తీసుకెళ్లాలి: ప్రత్యేక అధికారి

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పురాతనమైన మూడు పెద్ద బురుజులు ఉన్నాయి. ఆ బురుజులు కూల్చేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సందర్శించి పరిశీలించడం జరిగింది. వాటిని కూల్చడానికి ఎవరైనా ముందుకు వస్తే వారితో చర్చించాలని ఒకపక్క, కలెక్టర్ మరోపక్క, ఎమ్మెల్యే పంచాయతీ ప్రత్యేక అధికారికి పంచాయతీ కార్యదర్శి సూచించిన ఫిదమట మద్నూర్ లోని పురాతనమైన బురుజులు వారే కూల్చాలి, వారే మట్టిని తీసుకువెళ్లాలి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే వారికి అనుమతులు ఇస్తామని పంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ విజయ్ విలేకరులకు తెలియజేశారు. లక్షల రూపాయల విలువైన పురాతనమైన బురుజు మట్టి ఎంతో విలువైనదని, అలాంటి మట్టి బురుజులు కూల్చిన వారికి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇస్తామని తెలిపారు.