కోటగిరిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

నవతెలంగాణ – కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ కవిత అరెస్టును  నిరసిస్తూ  మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ ఆధర్వంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలియజేసి, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, కావాలని కక్ష ధోరణిలో బీజేపీ మద్యం కుంభకోణం పేరుతో అరెస్టు చేయించిందని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, ఆనంద్, శ్రీధర్, ఉదయ్, కూచి సిద్దు, జుబేర్  తదితరులు పాల్గొన్నారు.