
– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ – తొగుట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తమ స్వార్ధానికి వాడుకుంటూ దుర్వినియోగం చేస్తుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివా రం ఎమ్మెల్సీ కవిత అరెస్టు ను నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అరెస్టు చేయడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. చోటే బాయ్, బడే బాయ్ లు కలిసి తెలంగాణ లో బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారన్నారు. నిస్వార్థంగా పని చేయా ల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థ లకు కేవలం ప్రతిపక్ష నాయకులే కనిపిస్తున్నారా, బీజేపీ నాయకులంతా తులసి మొక్కలా అని ఆయన ప్రశ్నించారు. కవిత కు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు..ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ వేల్పుల స్వామి, నాయకులు సిరినేని గోవర్ధన్ రెడ్డి, చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి, సుతారి రమేశ్, బోధనం కనకయ్య, పబ్బ తి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.