బీఆర్ఎస్ కి, బీజేపీ కి ములకత్ లేదని నమ్మించేందుకే కవిత అరెస్ట్: ఆది శ్రీనివాస్

– పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బుతో గెలవాలని చూస్తోంది..
– రాష్ర్టాన్ని దోచుకొని పక్క రాష్టాల్లో పార్టీ ఆఫీస్ లు పెట్టారు..
– బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తుంది..
– నరేంద్ర మోడీ కాల పరిమితి ముగిసింది..
– తెలంగాణలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది..
నవతెలంగాణ – వేములవాడ
బీఆర్ఎస్ కి, బీజేపీ కి ములకత్ లేదని నమ్మించేందుకే కవిత అరెస్ట్..బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తుందని, దేశంలో నరేంద్ర మోడీ కాల పరిమితి ముగిసిందని అన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దోచుకున్న డబ్బుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుందని, దానికి నిదర్శనమే శుక్రవారం రోజున కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6 కోట్ల 67 లక్షలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడలోనీ ఆది శ్రీనివాస్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మేం చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే బీఆర్ఎస్ పార్టీకి  ప్రజా ప్రతినిధికి చెందిన డబ్బు పట్టుబడడం దానికి నిదర్శనం అన్నారు. కరీంనగర్ ప్రతిమ మల్టిఫ్లెక్స్ లో దొరికిన 6 కోట్ల 67 లక్షల డబ్బు ఎవరివివని ప్రశ్నించారు,ఎన్నికలు షెడ్యూల్ రాకముందే విచ్చల విడిగా డబ్బుల పంపిణీ చేసేందుకు బిఅర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో ఆర్టీసి స్థలం ను లీజు కు తీసుకొని ప్రతిమ మల్టిఫ్లెక్సీ కట్టారని అవి ఎవరివో అందరికీ తెలుసన్నారు. మల్టీప్లెక్స్ లోని సెల్లార్లో ఆయిల్ కటన్ డబ్బాల్లో డబ్బులను ప్యాక్ చేశారని కాలేశ్వరంలో దోచుకున్న డబ్బుతో గెలువలని చూస్తున్నారని, కాలేశ్వరం ప్రాజెక్టును మా కామదేనుగా మార్చుకున్నారు అని వెల్లడించారు. గత ఎన్నికలలో ప్రజలు బీఅర్ఎస్ కి కర్రు కాల్చి వాత పెట్టారని, కానీ మళ్ళీ తొమ్మిదిన్నర ఏళ్లలో సంపాదించినా డబ్బులు పంచి మళ్ళీ గెలవాలని చూస్తుందన్నారు. బిఅర్ఎస్ నేతలు ఎన్ని కుట్రాలు చేసిన ప్రజలు తిరస్కరిస్తారని, రాష్ట్రం లో బిఅర్ఎస్  కాలం చెల్లిందని అందులో మిగిలేది కేసీఅర్, కెటిఆర్, హరీష్, కవిత మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ను కవిత నే కనిపెట్టినట్లు చేస్తుందని, అధికారంలో ఉన్నపుడు జ్యోతి రావు పూలే, అంబేడ్కర్ జయంతి,వర్థంతి ల లకు కెసిఆర్  ఏనాడు కూడా పూల మాలాలు వేయలేదని తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్ జయంతికి పూల మాల వెయ్యని వారు అసెంబ్లీ లో జ్యోతి రావు పూలే విగ్రహం పెట్టామనడం విడ్డురంగా ఉంది, వారి పెరితో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ మహిళ అయి ఉండి మద్యం కుంభ కోణం లో ఇరుక్కోవడం సిగ్గు చేటున్నారు. బీజెపీ, బిఅర్ఎస్ రెండు ఒక్కటి కాదు అని చెప్పడానికి మాత్రమే నిన్నటి రోజున కవిత అరెస్ట్ డ్రామా అనీ అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసమే బీజెపీ, బిఅర్ఎస్ డ్రామాలని, బీజెపీ, బిఅర్ఎస్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కవిత అరెస్ట్ అనేది గత ఏడాది అక్టోబర్ కావాల్సి ఉండే…బీజెపీ, బిఅర్ఎస్ ఒక్కటే అని ప్రజలు అనుకుంటున్నారని  గతంలో బీజెపీ నేతలే ఆరోపించారు అని తెలిపారు. బిఅర్ఎస్ తో తమకు మిలకథ్ లేదు అని చెప్పడానికే బీజెపీ కవిత ను అరెస్ట్ చేసిందని, బీజెపీ, బిఅర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలోలేరన్నారు. రాష్ట్ర ప్రజయోజనాల పైన బీఅర్ఏస్ కి ఏ మాత్రం చిత్త శుద్ది లేదని గతంలో  ప్రధాని ని కలిసిన కేసీఅర్ సాధించింది ఎం లేదని,కేవలం కెటిఆర్, కవిత ల కేసుల మాఫీ కోసమే మోడీని కేసీఅర్ కలిశారని, కానీ ప్రజల సంక్షేమం కోసం కాదన్నరు. తెలంగాణ రాష్ట్రన్ని దోచుకొని పక్క రాష్టాల్లో పార్టీ ఆఫీస్ లు పెట్టారని, ఇక్కడి రైతులు చనిపోతే వారిని పట్టించుకోకుండా పక్కా రాష్ట్రాల్లోని రైతులకు  డబ్బును పంచిపెట్టారన్నారు. బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తుందని, దేశంలో నరేంద్ర మోడీ కాల పరిమితి ముగిసిందని అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రజలు కాంగ్రెస్ ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి వస్తాయని ఇప్పటికే సర్వేలు స్పష్టం చేసాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కౌన్సిలర్లు ఇప్పప్పుల అజయ్, చిలుక రమేష్ ,తూమ్ మధు, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్ ,అరుణ్ తేజ చారి, మహిళా అధ్యక్షురాలు తోట లహరి, శ్రీశైలం తో పాటు తదితరులు పాల్గొన్నారు.