– టెన్ షన్ వద్దు
– ఆత్మ విశ్వాసంతో ఒత్తిడి దూరం
నవతెలంగాణ – వీర్నపల్లి
విద్యార్థి జీవితాన్ని కీలక మలుపు తిప్పేది పదో తరగతి వార్షిక పరీక్షలే ఏడాది పొడువునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విధ్యార్థులకు …. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో సహజంగానే ఒత్తిడి పెరుగతోంది. మంచి మార్కులు వస్తాయో లేదోనని ఆందోళన కలుగుతుంది. ఒత్తిడిని అధిగమించి ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు . చదువుకునే వాతావరణం తీసుకునే ఆహారం కొద్ది పాటి మార్పులు చేసుకోవడంతో పాటు పిల్లలో భయాందోలన కలుగకుండా ఆత్మ విశ్వాసం నింపడంతో తల్లీదండ్రుల తోడ్పాటు ఎంతో కీలకం నచ్చిన ప్రదేశాలు, ఇష్టమైన వ్యక్తుల సమక్షంలో చదువుకోవడం ఎంతో మేలు. విద్యార్థులు తమ టెన్షన్ దూరం చేసుకునేందుకు నిపుణులు చేస్తున్న సూచనలు ఇవి.
మార్కులు కోసం పిల్లుల్ని వేధించకండ: విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకం. వారి ప్రోత్సాహం లేకుంటే పిల్లలు ఎందులోనూ రాణించలేరు . మార్కుల పేరిట ఒత్తిడి తేవడం సరికాదు. సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలి . బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దకూడదు పిల్లలకు చదువు రాదని మార్పు తక్కువగా వస్తాయని ఫెయిల్ అవుతారని వారి స్నేహితుల కన్నా వెనుక పడ్డావ్ అంటూ నెగిటివ్ ధోరణితో కించపరచొద్దు. ముఖ్యంగా ఫలితాలపై అతిగా అంచనాలు పెంచుకోవడం కూడా మంచిది కాదు. ర్యాంకులు వస్తాయని ఆశించి ఆమెరా చదవాలని ఒత్తిడి చేయొద్దు. తర్వాత ర్యాంకులు రాలేదని వేధిస్తే మానసిక స్థైర్థం కోల్పోయి ముందుకు సాగలేరు.
ఆహారం ప్రధానం: ఏడాది పొడవుగా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్లో కొందరు వార్షిక పరీక్ష సమయంలో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనుకబడినా సందర్భాలు అనేకం పిల్లలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తోపాటు ఒత్తిడి దూరం చేసుకున్నందుకు రోజువారిగా తీసుకుని ఆహారంలో కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మేలు. సాత్విక ఆహారంతో శరీరానికి కావలసిన పోషకాలు లభించడంతోపాటు ఉత్సాహం చేకూర్తుంది. పండ్లు కూరగాయలు తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పరీక్షకు వెళ్లే సమయానికి మూడు గంటలు ముందే తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి మధ్యాహ్నం రాత్రి బలవర్ధకమైన ఆహారం తక్కువ మోతదులు తీసుకుంటే మంచిది.
ఆరు గంటల నిద్ర అవసరం: బాగా తినాలి… బాగా చదవాలి.. బాగా పరీక్షలు రాయాలి. ఈ మూడు అంశాలను విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి పరీక్షల్లో బాగా రాయాలనే ఆత్రుతతో సమయపాలన లేకుండా చదవడం మంచిది కాదు . నిద్రలేమిటో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పరీక్ష కేంద్రాల్లో కండ్లు మూత పడుతుంటాయి. కునుకు తీయాల్సి వస్తుంది. ఏకాగ్రత కోల్పోతుంది. చదివినవి గుర్తుకు రావు సమాధానాలు సరిగా రాయలేరు . అందుకే పరిపూర్ణంగా నిద్రపోవాలి విద్యార్థులు రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం తప్పనిసరి.
మానసిక సన్నద్ధత ఇలా:
1)కేంద్రాన్ని ముందుగానే చూసుకుంటే చివరి విషయంలో హైరానా ఉండదు.
1)కేంద్రాన్ని ముందుగానే చూసుకుంటే చివరి విషయంలో హైరానా ఉండదు.
2)పరీక్ష ముందు రోజు హాయిగా నిద్రపోవాలి. నిద్ర మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది.
3)పరీక్షలకు వెళ్లే ముందు పెన్ను పెన్సిల్ ప్యాడు హాల్ టికెట్ ను సరిచూసుకోవాలి .
4)ఎగ్జామ్ సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
5)కొత్త వాతావరణంలో ఉన్నామనే భయాన్ని వదలి వేయాలి.
6)ప్రశ్నలు అన్నిటిని క్షుణ్ణంగా చదివి బాగా రాయగలను అనుకున్న ఆరు ఏడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి చివరిగా ఎంపిక చేసుకున్న ప్రశ్నలకు జాబు రాయడం మంచిది.
రాత బాగుంటే…. మంచి మార్కులు:
పరీక్షలో చదవడంతోపాటు రాత కూడా ముఖ్యం
చేతిరాత బాగుంటే 10 నుంచి 15% మార్కులు అదనంగా పొందవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
చేతిరాత బాగుంటే 10 నుంచి 15% మార్కులు అదనంగా పొందవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
రాసేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి :
1)పెన్ను పెన్సిల్ పట్టుకునే విధానం తగిన విధంగా ఉండాలి.
2)ఎట్టి పరిస్థితుల్లో రెడ్ గ్రీన్ పెన్నులు వాడకూడదు. బ్లూ లేదా బ్లాక్ పెన్నులు వాడాలి.
3)పదాలు. వాక్యాలు. పేరాల మధ్య తగిన స్థలం వదలాలి.
4)అక్షరాలు సైజు స్పష్టంగా కనిపించేలా ఒకే తీరు ఉండాలి.
5)గొలుసు కట్టు రాత. అక్షరం భాషా దోషాలు ఉండకూడదు.
6)వేగంగా రాయడం ప్రాక్టీస్ చేయాలి.
ఇవి పాటించాలి:
1) సమాధానం రాసేముందు ప్రశ్నల నంబర్లు సరిగ్గా వేయాలి.
2)సమాధాన పత్రాలు ఇవ్వగానే స్కేలు సాయంతో తగిన మార్జిన్ పెట్టుకోవాలి.
3)జవాబు పత్రంపై ఒక్కో పేజీకి 16నుంచి 18 లైన్లకు మించకుండా చూసుకోవాలి.
4)ఆన్సర్ షీట్ పై ప్రతి వాక్యం స్టేట్ గా ఉండేలా రాయాలి.
5)ముఖ్యమైన అంశాల కింద అండర్ లైన్ ఉండేలా చూసుకోవాలి.
6)కామ. పుల్ స్టాపులు పాటిస్తూ రాయాలి.
7)తెలుగులో అక్షరాలు గుండ్రంగా. తలకట్టు. దీర్ఘాలు. ఒత్తులు స్పష్టంగా కనిపించేలా ఉండాలి.
8)ఇంగ్లీష్ లో పదాలను స్లాంట్ గా, స్ట్రోక్స్ పాటిస్తూ రాయాలి.
9)స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఓవర్ రైటింగ్ ఉండకుడదు .
10)క్యాపిటల్ స్మాల్ స్మాల్ లేటర్ వ్యత్యాసం గమనిస్తూ రాయాలి.
11)సైన్స్ సోషల్ లో బొమ్మలు గీయడం లేదా పటంలో స్థలాలను స్పష్టంగా గుర్తించాలి.