
నవతెలంగాణ – కంటేశ్వర్
మాజీ విప్ ఈరవత్రి అనిల్ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా, కాసుల బాలరాజ్ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పటాకులు కాల్చి సంబరాలు ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా వరద బట్టు వేణురాజ్ మా అభిమాన నాయకులు మాజీ విప్ ఈరవత్రి అనిల్ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా, కాసుల బాలరాజ్ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి జిల్లా అగ్ర నాయకులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి షబ్బీర్ అలీ కి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడి పని చేసిన వారికి, కార్యకర్తలకు కొండంత మనోధైర్యాన్ని నింపుతూ పార్టీని కంటికి రెప్పలా కాపాడిన నాయకులకు పార్టీ టికెట్లు త్యాగం చేసిన వారికి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అనడానికి ఇది మరో నిదర్శనమని ఆయన అన్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన తాహెర్బీన్ హందాన్ గారిని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు నలుగురిని రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు గా నియమించడం జిల్లాకు గర్వకారణమని ఆయన అన్నారు. జిల్లా చెందిన సమర్థవంతమైన నలుగురు నాయకులను కార్పొరేషన్లుగా నియమించడం హర్షించదగ్గ విషయమని ,వీరి నియామకంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదురులేని శక్తిగా అవతరిస్తుంది వారికి కేటాయించిన కార్పొరేషన్ల అభివృద్ధికి వారు ఎల్లవేళలా కృషి చేయడమే కాకుండా ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు మరింత సేవ చేస్తారని ఆయన భరోసా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తలు పార్టీ గుర్తిస్తుందని రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసే నిజామాబాద్ పార్లమెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ గెలిచేలా చేయాలని పార్లమెంట్ ఎన్నికల తర్వాత జిల్లా స్థాయి కార్యకర్తలను పార్టీ తప్పకుండా గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన అన్నారు.వివిధ కార్పొరేషన్ చైర్మన్లు గా నియమింపబడ్డ మా ప్రియతమ నాయకులు అనిల్ అన్న గారు మోహన్ రెడ్డి అన్నగారు అన్వేష్ బాలరాజు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చట్ట సభలకు కూడా ప్రాతినిధ్యం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, నరేందర్ సింగ్ ప్రసాద్ రాజు అయూబ్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు సాయికిరణ్, శివ, నిఖిల్ రెడ్డి, సందీప్ రెడ్డి, హరీష్ ,రాజేష్, సతీష్ ,అక్షయ్, బబ్లు, ప్రవీణ్ ,సందీప్ ,కుషాల్ సృజన్ తదితరులు పాల్గొన్నారు.