ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా కాసుల బాలరాజ్ 

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్ గా కాసుల బాలరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞత అభినందనలు తెలిపారు. ఆదివారం బాన్సువాడ లో ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా కాసుల బాలరాజును, బీర్కూర్ మున్నూరు కాపు సంఘ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ తనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.