
– అడిగిందొకటి..ఇచ్చేదొకటి..
నవతెలంగాణ – జమ్మికుంట
సమాచార చట్ట హక్కు క్రింద దళిత బంధు పథకంలో ఎలాంటి సరుకులు, వస్తువులు ఇవ్వకుండా, బిల్లులు ఇచ్చారని పూర్తి సమాచారం కావాలని ఆర్టిఐ కింద దరఖాస్తు చేస్తే, అడిగిన సమాచారము ఒకటి అయితే మరొక సమాచారం ఇస్తున్నారని జమ్మికుంట కు చెందిన పబ్బు శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. .2021 హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల హామీలో భాగంగా దళిత బంధు పథకాన్ని పైలెట్ పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించారు. దళిత బంధు పథకము దళితులకు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి గొప్ప పథకంగా దేశంలోనే పేరుగాంచింది. కానీ ఈ దళిత బంధు పథకాన్ని అడ్డుపెట్టుకొని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ ,హోల్ సేల్ షాప్ యజమానులు లబ్ధిదారుల నుండి లక్షలాది రూపాయలు తీసుకొని ,ఎలాంటి సరుకులు ఇవ్వకుండానే, ఇచ్చినట్లుగా బిల్లు ఇవ్వడం జరిగిందని పలు విమర్శలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎంతమందికి ఏ ఏ షాపుల వారు ఏమేమి ఇచ్చారో పూర్తి బిల్లులతో ఇవ్వాలని పబ్బు శ్రీనివాస్ ఆర్టిఏ క్రింద సమాచారము కొరకు చేసినట్లు తెలిపారు. గత నాలుగు నెలల నుండి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న, తను అడిగినటువంటి సమాచారం కాకుండా, దళిత బంధు విధివిధానాలను మాత్రమే ఇవ్వడం వెనుక అధికారుల మతలబు ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. గత నాలుగు మాసాల క్రితం దళిత బంధు లబ్ధిదారుల సరుకుల పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ ,హోల్ సేల్ షాప్ డీలర్స్ వారు సప్లై చేసిన ఇన్వైస్ బిల్లు కావాలని ఆర్టిఏ క్రింద దళిత బంధు పి ఐ ఓ దరఖాస్తు పబ్బు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇన్వైస్ బిల్లులను ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ పి ఐ ఓ కరీంనగర్ ను కోరగా, కోరిన సమాచారము ఇవ్వకుండా దళిత బంధు విధి విధానాలు గురించి సమాచారము ఇవ్వడం జరిగిందని తెలిపారు. దాంతో ఇన్ఫర్మేషన్ అప్లియేట్ ఆఫీసర్ అయిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కరీంనగర్ కు సమాచారం ఇవ్వాలని ఆర్.టి.ఐ క్రింద దరఖాస్తు చేయగా ,అతను కూడా దళిత బంధు విధివిధానాలు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దానితో సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ అయిన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే నేను అడిగిన సమాచారము ఇవ్వాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బె ఖాతార్ చేస్తూ ,ఉత్తిత్తి సమాచారాన్ని మళ్లీ అదే దళిత బంధు విధి విధానాలను ఇవ్వడం కోస మెరుపు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే, చట్టాలను ఉల్లంఘించడం తీవ్రంగా పరిగణించాలని, ఆర్టిఐ క్రింద అడిగిన ఏ సమాచారాన్ని కూడా ప్రతి శాఖలో ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై మూడు నెలలకు ఒకసారి జరిగే సమీక్ష సమావేశంలో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టిఐ ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను పబ్బు శ్రీనివాస్ కోరారు.