నవతెలంగాణ – వేములవాడ రూరల్
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనోహర్ రెడ్డి మిత్రమండలి సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడే ముక్కులు చెల్లించారు. మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం రాజన్న ఆలయం ముందు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు, అన్నదానం చేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న మంచి మనసుతో స్పందించే వ్యక్తి ఏనుగు మనోహర్ రెడ్డి అని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మిత్రమండలి సభ్యులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.