ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి కిందపడ్డ గీత కార్మికుడు    

నవతెలంగాణ – ఆత్మకూర్ ఎస్
మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన యరగాని వెంకన్న  వయస్సు (54)  గీత కార్మికుడు, రోజు మాదిరిగా నే శనివారం రాత్రి తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడ్డాడు. దీంతో మెడ నరాలు దెబ్బ తిన్నాయి. కాళ్లు చేతులు కదలటం లేదు, పైకి లేవడం లేదు. ప్రమాదకరంగా  అక్కడక్కడ బలమైన గాయాలు తగిలి స్పృహ కోల్పోవడంతో, 108 ద్వారా సూర్యాపేట హాస్పిటల్ తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలు ఇవ్వాలని  తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్బ గాని బిక్షం, జిల్లా కమిటీ సభ్యుడు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తండ రమేష్ మండల అధ్యక్షుడు కార్యదర్శి నోముల వెంకన్న, బెల్లంకొండ ఇస్తారి, సొసైటీ అధ్యక్షులు కాట్ల వెంకన్న డిమాండ్ చేశారు.