
తెలంగాణలో అన్నీ ఎంపీ సీట్లను కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని, బీఆర్‌ఎస్‌కు నామమాత్రంగా ఓట్లు పడతాయని చెప్పారు. ప్రజలపక్షంలో బీఆర్‌ఎస్ పోటీలో లేదన్నారు. ఇక లిక్కర్‌స్కామ్‌లో కవిత ఇరుక్కుందని, ఆమె ఎప్పుుడో లోపలికి వెళ్ళాల్సింది ఇప్పుడు వెళ్లిందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటి కాదు అని రుజువు చేయడానికి బీజేపీ ప్రయత్నమే ఈ అరెస్ట్ అన్నారు.