పరీక్ష కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం నిర్వహించాలి 

నవతెలంగాణ – మిరు దొడ్డి 
మిరుదొడ్డి  మండలoలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 9:30 కు పరీక్షా సమయం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రo వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అధికారులు తెలిపారు. విద్యార్థులు భయంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఎగ్జాం సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీస్ పహారాలు విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు ఎవరైనా అస్వస్థకు గురైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. విశాలమైన గదులలో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా చర్యలు చేపట్టారు.