కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి సోమవారం భారీ చేరికలు జరిగాయి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు. మండలంలోని ఆత్మకూర్ మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి. మాసంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ విట్టల్. మాటూర్ మాజీ ఉపసర్పంచ్ కృష్ణ. జలాల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ బలరాం రెడ్డి  తోపాటు మాటూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు బెస్త సత్యం. ఎండి సలీం. భిక్కనూరి కిష్టయ్య .పసుల విటల్, చింతలపల్లి హనుమంతు బాలనగర్ శ్రీనివాసరెడ్డి. సోమన్న గారి శ్రీనివాసరెడ్డి. బెస్త సురేందర్ తో పాటు 50 మంది పార్టీలోకి చేరినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.