
పదవ తరగతి విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించిన మాజీ సర్పంచ్ బీరప్ప.మండలంలోని నాగినేనిపల్లి సర్పంచ్ బట్కిరి బీరప్ప టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం ఇబ్బంది ఉండడంతో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ప్రతి సంవత్సరం ఆటోలు ఏర్పాటు చేస్తున్నానని బీరప్ప తెలిపారు. పరీక్షలు బాగా రాసి జిల్లాలో మొదటి ర్యాంకు రావాలని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని తెలిపారు.