
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్లమెంటు అభ్యర్థిగా అబ్బగోని అశోక్ గౌడ్ ను ఖరారు చేసినారు.. .బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాల్లో పోటీ చేసే పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినట్లుగా సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బహుజనుల కు ఎల్లప్పుడూ అండగా ఉండే ఏకైక పార్టీ బహుజన లెఫ్ట్ పార్టీ అని తెలిపారు. అగ్రవర్ణాల పార్టీ లు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేవలం రాజ్యాధికారం కోసమే మత పరమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ సామాన్య పేద దళిత బడుగు బలహీన వర్గాల ఓట్లను దండుకొని పట్టం కట్టుకుంటున్నాయి. అని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీ కులాలను ఇంతవరకు వారి దమాష ప్రకారం లెక్కించకపోవడం మరి చట్టసభలలో బీసీలకు తమాషా ప్రకారం సీట్లను ఇవ్వకుండా ఇంతవరకు కులగణను చేయకుండా మళ్లీ ఎన్నికలలో కేవలం మతపరమైనటువంటి రాజకీయాలను చేస్తూ ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కావొస్తుందని మరి ఇంతవరకు బీసీ కులగణను చేపట్టకపోవడం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారుతుందని డిమాండ్ చేశారు. గతంలో పరిపాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వారి కుటుంబ పరిపాలనకు అంకితం అయిపోయిందని ప్రజల సమస్యలను మరి నిరుద్యోగ సమస్యలను ఎన్నడూ కూడా పట్టించుకోని దాఖలాలు లేవని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకపోవడంతో జీర్ణించుకోలేక మళ్ళీ అధికారంలోకి రావాలని తెలంగాణను మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనలో తెలంగాణ అస్తవ్యస్తంగా మారిందని రైతు బంధు పథకం కింద కొన్ని వేల కోట్లు కుంభకోణాలు జరిగాయని, బిఆర్ఎస్ పార్టీ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని తెలిపారు. పేద బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంటు ఎన్నికలలో తన స్థానాన్ని నిలుపుకోవాలని ఓటు వేయాలని ప్రజలను మభ్యపెడుతూ ముందుకు వస్తుందని తెలిపారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో బి,ఎల్ పి పార్టీ తో పాటు ఎం సి, పి ఐ పార్టీ, బి,సీపీ పార్టీ, లేబర్ కమ్యూనిస్టు పార్టీ కూటమితోకలిసి పోటీ చేస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.