సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ల పై దృష్టి సారించాలి

– అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – మద్నూర్ 
పార్లమెంట్ ఎన్నికల పై పోలీస్, రెవెన్యూ అధికారులతో  సోమవారం మద్నూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో 05-జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 013- ఎస్సీ జుక్కల్ సెగ్మెంట్ _అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు డి. శ్రీనివాస్ రెడ్డి   సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఎన్నికలు సజావుగా సాగడానికి పోలీస్, రెవెన్యూ అధికారులు పటిష్ట మైన భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ లలో తాగునీరు, విద్యుత్, వికలాంగులకు ర్యాంప్ లు ఉండే విధంగా చూసుకోవాలి తెలిపారు.  వేసవి కాలం కాబట్టి త్రాగు నీటి  సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంత ర్రాష్ట్ర సరిహద్దు లో నిఘా విభాగం, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం లో బన్స్ వాడ డీఎస్పీ , సీఐ జగడం నరేష్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, 7-మండలాల తాసిల్దార్ లు  మరియు మద్నూర్ మండల తాసిల్దార్ ఎం.డీ ముజీబ్, డిప్యూటీ తాసిల్దార్ భరత్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్దావర్ శంకర్  కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.