– ముఖ్యదితిగా హాజరైన ఎంపిపి
నవ తెలంగాణ మల్హర్ రావు.
మండలంలో పెద్దతూoడ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ లో సోమవారం అంగరంగావైభవంగా 13వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్స్ పాల్ వాల శశిధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని అలరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా హాజరైన మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు మాట్లాడారు నేటి చిన్నారులే రేపటి పౌరులున్నారు.13 ఏళ్లుగా విద్యార్థులకు తన వంతుగా విద్యానందిస్తూ, తక్కువ పిజులతో పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్న కరస్పాండెంట్ శశిధర్ రావు ను అభినందించారు.అనంతరం హాజరైన ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు,సామాజిక కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించి,మేమేంటో లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దతూoడ్ల మాజీ సర్పంచ్ ఇనుగంటి విజయ నాగేశ్వర్ రావు, మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు, మాజీ వార్డు సభ్యులు,జర్నలిస్టులు,రాజకీయ నాయకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు