న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను దాటవేశారు. ఢిల్లీ జలబోర్డులో అవక తవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆదివారం ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమన్లు చట్టవిరుద్ధ మని, కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ లక్ష్యంగా చేసుకునేం దుకు ఇడిని వినియోగిస్తోందని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నమోదైన రెండో కేసు ఇది కావడం గమనార్హం.
సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌పై అభియోగాల రద్దు, బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆయనను వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. సత్యేందర్ జైన్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు వాదనలు విన్న అనంతరం కోర్టు జనవరి 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెల్లడించిన కోర్టు సత్యేందర్ జైన్ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను 2022 మే 30న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జైన్‌కు సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారని ఈడీ ఆరోపించింది. 2023 డిసెంబర్ 14న సత్యేందర్ జైన్‌కు వైద్యపరమైన కారణాలతో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు జనవరి 8 వరకు పొడిగించింది.