కామ్రేడ్ మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి..

– సీపీఐ(ఎం) పార్టీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునిగంటి రాజన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
కామ్రేడ్ మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించినట్లు సీపీఐ(ఎం) పార్టీ మహబూబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గునిగంటి రాజన్న తెలిపాడు మండల కేంద్రంలోని కామ్రేడ్ మల్లి స్వరాజ్యం వర్ధంతి సభను పెరుమాండ్ల బాబు గౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రజాకార్ల భూస్వాముల ఆకృత్యాలకు వెట్టిచాకిరి దొర నీ బాంచన్ కాల్మొక్త దోపిడి పీడనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ గొరిల్లా తెలంగాణ  పోరాటాలకు నాయకత్వం వహించి వారి విముక్తి కోసం అహర్నిశలు కృషిచేసి దొరలను రజాకార్లను తరిమికొట్టి దున్నేవాడికి భూమి కావాలంటూ లక్షలాది ఎకరాల భూస్వాముల కబంధహస్తాలలో ఉన్న భూములను పంచిన యోధురాలు మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తిని తీసుకొని ఇప్పటికీ దోపిడీ పీడనకు గురి అవుతున్న కార్మిక కర్షక విద్యార్థి యువజ నులకు అండగా నిలిచి ఉద్యమాలు చేపట్టడమే ఆమెకు నీ నిజమైన నివాళ్ళని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ నెల్లికుదురు మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు, మంగ్యా నాయక్, సత్యనారాయణ బిక్షపతి తోట నరసయ్య ఏకాంతం బాణాల యాకన్న, తోట శీను, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.