అనాధ శవాలకి అంత్యక్రియలు నిర్వహించిన స్వచ్చంద సేవా సంస్థ

నవతెలంగాణ – కంటేశ్వర్
గత ఐదు రోజుల క్రితం ఆనారోగ్యంతో  మృతిచెందిన   రెండు అనాధ శవాలకి  ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా  అంత్యక్రియలు నిర్వహించమని 1వ ఠాణా సి.ఐ విజయ్ బాబు కోరగా  బుధవారం దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో  సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారని ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. అనాధలుగా ఎవరులేని నిస్సహాయక స్థితిలో మృతిచెందిన అనాధ శవాలకి తమ సంస్థ అన్ని వారై పోలిసుల అనుమతితో అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యవర్గం కాసుల సాయితేజ మరియు మద్ది గంగాధర్, జయదేవ్,1వ. ఠాణా పోలిస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.