అభివృద్ధిలో ఎంపీటీసీలను భాగస్వామ్యులను చేయాలి

నవతెలంగాణ – రామారెడ్డి
అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయాలని ఎంపీటీసీలు మండల, డివిజన్ స్థాయి అధికారులకు బుధవారం సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులతో పాటు, ఎంపీపీ మాట్లాడుతూ.. పలు శాఖల అధికారులు గైహాజరవడంపై, పలు శాఖల నివేదికలు సమావేశంలో అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి శాఖపై రివ్యూ ఉంటుందని ఎంపీపీ అన్నారు. గిద్ద ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ… మండల పరిషత్ కార్యాలయానికి డిసెంబర్ 5వ తేదీన ప్రొజెటింగ్ కాపీలు ఇస్తామని చెప్పి సంతకాలు సేకరించి, సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు, తేదీని మార్చడంపై సభలో గల మెత్తారు. ఆఫీస్కు వస్తే ఎంపీటీసీ సభ్యులకు కనీస గౌరవం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను మండలంలో గాని, నియోజకవర్గ కేంద్రంలో గాని అందించాలని రెడ్డిపేట ఎంపీటీసీ రాజ గౌడ్ సూచించారు. గిద్ద గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు పై చర్చ జరిగింది. కార్యక్రమంలో జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, ఎమ్మార్వో రోజా, ఎంపీఓ సవితారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.