కన్నప్ప కామిక్‌ బుక్‌ విడుదల

కన్నప్ప కామిక్‌ బుక్‌ విడుదలవిష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలేె పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. వెండితెరను మించిన కొత్త క్రియేటీవ్‌ వెంచర్‌ను ఆవిష్కరించారు విష్ణు మంచు. తన తండ్రి మోహన్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19న ‘కన్నప్ప స్టోరీ బుక్‌ వాల్యూమ్‌ 1’ని లాంచ్‌ చేశారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్‌ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్‌ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
”కన్నప్ప కామిక్‌ బుక్‌ వాల్యూమ్‌ 1” ద్వారా భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలుస్తాయి. ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక భావనలను చూపించనున్నారు. ఈ కామిక్‌ పుస్తకంతో విష్ణు మంచు భక్త కన్నప్ప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంస్కతిక వారసత్వంతో వినోదాన్ని మిళితం చేయడం ద్వారా, కన్నప్పపై ఆసక్తిని రేకెత్తించడానికి, కన్నప్ప పట్ల భక్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించారు. ”కన్నప్ప స్టోరీ బుక్‌ వాల్యూమ్‌ 1” విడుదల అనేది భారతీయ సంస్కతి గొప్పతనాన్ని మాత్రమే కాకుండా, కన్నప్ప కథపై విష్ణు మంచు నిబద్ధతను కూడా ప్రదర్శించింది. ఇన్‌ స్టాగ్రాంలో రిక్వెస్ట్‌ చేేసిన వారికి, వారి చిరునామాను పంపిన వారికి ఉచితంగా పుస్తకాలు అందుతాయి. విష్ణు మంచు మాట్లాడుతూ, ‘ఈ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. కామిక్‌ పుస్తకం.. సినిమా లానే ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నాను. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. కన్నప్ప సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌ బాబు జన్మదిన వేడుకల,ు మోహన్‌ బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు డా. మోహన్‌లాల్‌ గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేయగా, శ్రీ ముఖేష్‌ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. నా తనయుడు విష్ణు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. కన్నప్ప చరిత్ర గురించి ఇప్పటి యువతకు చేరాలన్న విష్ణు కల కామిక్‌ బుక్‌ రూపంలో తీరడం ఆనందంగా ఉంది. అలాగే సినిమా సైతం విజువల్‌ వండర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో అందర్నీ విశేషంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
– మోహన్‌బాబు