– సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలను స్మరిస్తూ అమరవీరుల దినోత్సవమైన ఈనెల 23ను ‘సేవ్ డెమోక్రసీ డే’గా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది.ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ కేంద్రాల్లో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, అమరవీరులకు నివాళులర్పించడంతోపాటు సభలు, సమావేశాలు నిర్వహించాలని ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్, పశ్య పద్మ, వి. ప్రభాకర్, మండల వెంకన్న, మామిడాల భిక్షపతి, కొండల్, పెద్దారపు రమేష్, జక్కుల వెంకటయ్య, ప్రమీల, నాగిరెడ్డి, బాలమల్లేశ్, ఆర్. వెంకట్రాములు, రామకృష్ణ, గోనె కుమారస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిజ్ఞ చేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్‌కేఎంతోపాటుతోపాటు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, వృత్తి, ఆదివాసీ, గిరిజన, సామాజిక, మైనార్టీ సంఘాలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.