కామ్రేడ్ కిరణ్ మృతి విప్లవ కార్మికోద్యమానికి తీరని లోటు

– బలమైన విప్లవ కార్మికోద్యమా  నిర్మాణమే కామ్రేడ్ కిరణ్ కు నిజమైన నివాళి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్ టియు) రాష్ట్ర నాయకులు, తెలంగాణ ప్రగతిశీల ఆటోవర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, మాస్ లైన్ (ప్రజాపంథా) హైదరాబాద్ సిటీ నాయకులు  కామ్రేడ్ వి.కిరణ్  మృతి విప్లవ కార్మికోధ్యమానికి తీరని లోటని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్ టియు)జిల్లా  సహాయకార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షురాలు వి. సత్తేమ్మ అన్నారు. బలమైన విప్లవకార్మికోధ్యమ నిర్మాణమే కామ్రేడ్ కిరణ్ కు నిజమైన నివాళులని పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కిరణ్ చిత్ర పటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కామ్రేడ్ కిరణ్ నీటిలో చేపల ప్రజల్లో ముఖ్యంగా కార్మిక రంగంలో కలసిపోయారన్నారు. ఆటో వర్కర్స్ లో చురకైనా పాత్ర పోసించారన్నారు. విప్లవొద్యమ నిర్మాణంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో, ఆర్టీసీ కార్మికుల పోరాటంలో చాలా చురుకైనా మిలిటెంట్ పాత్ర పోశించారని తెలిపారు. కామ్రేడ్ కిరణ్ ఆటో కార్మికుల స్నేహశీలిగా ఉండే ప్రజా నాయకుడు అన్నారు. బలమైన విప్లవ కార్మికోద్యమ నిర్మాణం ద్వారా మాత్రమే కామ్రేడ్ కిరణ్ ఆశయాలు నెరవేర్చగలుగుతాం అన్నారు. కార్యక్రమంలో సీపీఐ ( ఎంఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా)పార్టీ, ఐఎఫ్ టియు,  ఏఐపీకేఎస్ డివిజన్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.