పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

నవతెలంగాణ – బొమ్మలరామరం 

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కె.కరుణ అన్నారు. శుక్రవారం మండల సోలిపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా, సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసాన, చిరుధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారించుట గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆటపాటలతో విద్యను అందించడం ద్వారా వారు మానసికంగా శరీరకంగా ఆరోగ్యంగా ఉంటారని, పోషకాహారం తీసుకున్నట్లయితే అనేక వ్యాధులకు గురి అవుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని మహిళలు తీసుకోవాలన్నారు. చిరుధాన్యాలతో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మహిళలు, బాలింతలు, రక్తహీనత ఉన్న వారు వాటిని తీసుకోవాలని పేర్కొన్నారు.అనంతరం ఏ ఊరిలోనూ పోషకలోపం ఉండకూడదనే ఉద్దేశంతో మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు మమత, స్వప్న, వరమ్మ, సాధన,సునీత, మహేశ్వరి, శాంతి, బాలమణి ,అనిత ,స్వరూప, ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.