రోడ్డు అంచున పొంచి ఉన్న మృత్యు ప్రమాదం

నవతెలంగాణ – శంకరపట్నం
రోడ్డుకి సమాంతరంగా మృత్యు ప్రమాదంగా మారిందని శుక్రవారం శంకరపట్నం మండల పరిధిలోని ముత్తారం,కన్నాపూర్  గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. ముత్తారం గ్రామ ప్రజలు గతంలో సింగిల్ రోడ్డు పక్కన గల వ్యవసాయ బావి కి డబుల్ రోడ్డు నిర్మాణంతో రోడ్డు అంచుకు చేరిందని దీనికి గల రక్షణ గోడ కూలిపోయి ఉండడంతో  మృత్యు ప్రమాదానికి నెలవైన విధంగా మారిందన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి సంబంధితశాఖ అధికారులు తగిన రక్షణ చర్యలను చేపట్టి ప్రయాణికులను రక్షించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.