నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లోని వేంకటేశ్వర కాలనీలో జరిగిన హత్య కేసులో నలుగురు నేరస్తులకు జీవితకాలం కారాగార శిక్ష జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల విధించినట్టు జిల్లా సీపీ కల్మేశ్వర్ తెలిపినారు. వివరాలు ఇలా ఉన్నవి. తేదీ 08.07.2018 నాడు పోలీస్ స్టేషన్ పరిదిలోని మామిడిపల్లి వేంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న బోణికే భారతి W/o లింగయ్య, వయ్యస్సు: 55 సం,,లు గారు దారుణ హత్యకు గురైనారు. ఇట్టి విషయములో మృతురాలి భర్త బోణికే లింగయ్య గారి ఫిర్యాధు మేరాకు అప్పటి ఇన్స్ పెక్టర్ అయిన పి. రాఘవేంధర్ నమోదు చేసి ధర్యాప్తు చేసి, లభించిన ఆధారాల ప్రకారం నేరస్థులు అయిన A-1/ తోకల చిత్ర, A2] బట్టు వెంకటేష్ చిత్ర @ చింటూ, A3] పందిర్ల రాజేంధర్ గౌడ్, A4] బట్టు రంజిత్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగినది. ఇట్టి కేసులో విచారణ అనంతరం చార్జ్ షీట్ వేయగా కోర్ట్ సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీమతి. సునీత కుంచల శుక్రవారం నేరస్థులకు జీవిత కాలం శిక్ష విదించనైనది. వేంకటేశ్వర కాలానిలో మృతురాలి ఇంటి ముందరే తోకల చిత్ర గారి ఇల్లు ఉంటుంది. అయితే మృతురాలు చేబడి చేయడం వలననే తోకల చిత్ర గారి ఆరోగ్యం సరిగా ఉండడం లేదని అనుకుని, మృతురాలి అక్క కొడుకు అయిన బట్టు వెంకటేష్ చిత్ర @ చింటు R/o బ్రహ్మణ పల్లి గ్రామం తో తెలిపి, మృతురాలిని చంపేయాలని చెప్పగా అందుకు బట్టు వెంకటేష్ చిత్ర @ చింటూ తన స్నేహితులు అయిన పందిర్ల రాజేంధర్ గౌడ్, బట్టు రంజిత్ లకి చెప్పగా అందుకు వారు కూడా ఒప్పుకుని తేదీ: 08.07.2018 నాడు మధ్యాహ్నం పూట మృతురాలి ఇంట్లోకి చొరబడి వారి వెంట తీసుకుని పోయిన కత్తితో ఒంటరిగా ఉన్న మృతురాలి గొంతు కోసి చంపినారని తెలిపారు , ఆమె చెవులను కూడా కోసి, చెవులకు గల బంగారు ఆభరణాలు బంగారు ఛైను మొత్తం సుమారు 24 గ్రాములు బంగారం దొంగిలించుకుని వెళ్ళినారు.ఈ కేసులో నేరస్థులకు శిక్ష పడుటకు ముఖ్య పాత్ర వహించిన ఏ సి పి జి. బస్వా రెడ్డి స్టేషన్ హౌస్ ఆఫీసర్. రవి కుమార్, జిల్లా ప్రాసిక్యూటర్ రవిరాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిజామాబాద కోర్ట్ కానిస్టేబుల్ శ్రీ. K.శంకర్. శ్రీకాంత్ గౌడ్ రాజేశ్వర్ , పోచయ్య, లను జిల్లా కమీషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ అభినంధించినారు.