– తండ్రి జ్ఞాపకార్థం గ్రామానికి ఉచితంగా పంపిణి
– రెండు లక్షల విలువైన సామాగ్రీ అందజేత
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పినవూర గ్రామం లో తేరా వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజినీకాంత్ రెడ్డి శనివారం పిన్నవూర గ్రామానికి రెండు లక్షల రూపాయలు విలువ చేసే టెంట్ హౌస్ సామాగ్రిని రజినీకాంత్ రెడ్డి బాబాయి తుకారం రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈసందర్బంగా తుకారాం రెడ్డి మాట్లాడుతూ గ్రామం లో ఎవరైనా పెండ్లిలు, ఫంక్షన్లు జరువు కునేవారు ఈ సామాగ్రీని ఎలాంటి డబ్బులు చెల్లించ కుండా ఉచితంగా వినియోగించు కోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్, పెద్దలు, బుచ్చి రెడ్డి, మెగా శ్యామ్ రెడ్డి, మిట్టపల్లి కిరణ్ కుమార్, నడ్డి ఆంజనేయులు , వూరే వెంకన్న, అనుముల కిషన్, కిలారి మురళి కృష్ణ యాదవ్,బొడ్డు వెంకట్, కోట అంజి,నడ్డి శ్రీనివాస్ , చెన్నా రెడ్డి, పెద్దులు, నాగరాజు, హేమాద్రి, లోకేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.