నవతెలంగాణ – జుక్కల్
పోయిన సెల్ ఫోన్ ను జుక్కల్ ఎస్సై సత్యనారాయణ అధ్వర్యంలో వెతికి పెట్టి బాదీతుడికి అందచేసిన సంఘటన జుక్కల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన కటికె నారాయణ తన సెల్ ఫోన్ ను పోగోట్టుకున్నాడు. జుక్కల్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై తన సిబ్బందితో కలిసి సిఈఐఆర్ యాప్ ద్వారా ఛేదించి, పట్టుకొని, బాదితునికి అందజేశారు.