
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంవ్యవసాయంగానికి పూర్తి సహకారం అందించడంతోపాటు అన్నదాతలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ సహకార సంఘం నూతన చైర్మన్గా ఎన్నికైన గంగారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపతిరెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు వ్యవసాయానికి అనేక సేవలు అందించే సొసైటీలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్ వడ్ల సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే గత ప్రభుత్వ అవినీతిని బయట పెడుతూ, అసలైన ప్రజా పాలన అందిస్తుందని అన్నారు. అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, తమ ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం తమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు వ్యవసాయానికి అనేక సేవలు అందించే సొసైటీలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్ వడ్ల సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే గత ప్రభుత్వ అవినీతిని బయట పెడుతూ, అసలైన ప్రజా పాలన అందిస్తుందని అన్నారు. అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, తమ ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం తమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.