దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలో స్వాతంత్ర సంగ్రామ దిశను మార్చిన యువకిశోరం సర్దార్ షహీద్ భగత్ సింగ్ 93వ వర్ధంతిని శనివారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు మాట్లాడుతూ భారత జాతీయ ఉద్యమంలో పాల్గొని కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్, అతని సహచరులు రాజగురు, సుఖదేవ్,అన్నారు. యువత మనువాద భావజాలపై అన్యాయాలపై స్పందించాలని దోపిడీ అక్రమాలు అన్నిటిపై నిత్యం పోరాడుతూ భగత్ సింగ్ మార్గంలో నడవాల్సిన అవసరం నేడు యువతపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు రేనయ్య, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.