
ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామానికి చెందిన పేదింటి వ్యవసాయ రైతు కుటుంబ దంపతులు తోళ్ల లింగమ్మ, వెంకటయ్య చిన్న కుమారుడు తోళ్ల నరేష్ ఇటివల వెల్లువడిన GATE (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)- 2024 ఫిజిక్స్ విభాగ పరీక్షలలో ఆల్ ఇండియా 1292 ర్యాంక్ సాధించి IISC,IIT,NIT( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) లాలో M.TEC/Ph.D చెయ్యడానికి అర్హత సాదించాడం జరిగింది. గత సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ప్రవేశ పరీక్షలలో ఫిజిక్స్ స్టేట్ 8వ ర్యాంక్ సాధించి ప్రొఫెసర్ ఎమ్.ప్రసాద్ అద్వర్యంలో పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తోటి ష్కోలర్స్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నరేష్ కు అభినందనలు తెలిపారు.