జలమే ప్రాణకోటి మనుగడకు మూలధారం

నవతెలంగాణ – నూతనకల్
జలమే ప్రాణకోటి  మనగడకు మూలధారమని, సాంఘీక సేవ సంస్థ (సి ఎస్ ఏ) ఏరియా కోఆర్డినేటర్ సిస్టర్ స్వర్ణ అన్నారు . శనివారం కేంద్రంలో ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా సి ఎస్ ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన నీటి ప్రాధాన్యతపై అవగాహన సదస్సు పాల్గొని మాట్లాడుతూ నీటి ని పొదుపుగా వినియోగించుకోవాలని నీటి యొక్క విలువను ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తు తరాలకు నీరు ఉపయోగపడే విధంగా కాపాడాలని అన్నారు. అనంతరం  విజయమేరి ఉన్నత పాఠశాల విద్యార్థులచే సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డుపై నీటిని పొదుపుగా వాడుకుందాం అంటూ నినాదాలచేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయమేరి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సబీనా, సంస్థ వాలేంటర్ సాబాది రమణ, యాదగిరి, కిరణ్, భవాని నాగరాజు, ముభీనా తదితరులు పాల్గొన్నారు.