– హుస్నాబాద్ ఏడీఏ మహేశ్ సూచన
– లక్ష్మిపూర్, వడ్లూర్ లో నేలకొరిగిన మొక్కజొన్న పరిశీలన
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వ నిబంధనల మేరకు సుమారు 33 శాతం నష్టం వాటిల్లితేనే పంటనష్టంగా అధికారులు పరిగణించాలని..రైతులు అత్యుత్సహంతో పంట నష్టపరిహర జాభితాలో నమోదు చేసుకుంటే పంట దిగుబడి విక్రయ సమయంలో సమస్యలు ఎదుర్కొంటారని హుస్నాబాద్ ఏడీఏ మహేశ్ సూచించారు. ఇటీవల ఆకాలంగా కురిసిన వడగళ్ల వానకు మండల పరిధిలోని లక్ష్మిపూర్,వడ్లూర్ గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు నమోదు చేసిన రైతుల పంట నష్టపరిహర నమోదు జాభితాను శనివారం ఏడీఏ మహేశ్ ఏఓ సంతోష్, ఏఈఓలు సాయి చరణ్,సాయి శంకర్,బాధిత రైతులతో కలిసి నెలకొరిగిన పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. సుమారు 33 శాతం పంట నష్టం వాటిల్లిన ప్రతి రైతుకు న్యాయం చేకూర్చేల నివేదిక రూపొందించి జిల్లాధికారికి అందజేస్తామని మరో మూడు రోజుల్లో మండలంలో పూర్తి పంట నష్టపరిహర జాభితాను అందజేయాలని అధికారులకు ఏడీఏ సూచించారు.