ఇంటి పన్ను తగ్గించేందుకు కృషి

– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌
మున్సిపాలిటీలో ఇంటి పన్నులు పెరిగి పెను భారంగా మారాయని, ప్రజల నుండచి ఫిర్యాదులు అందుతున్నాయని దీంతో ఇంటి పన్నులను తగ్గించాలని ప్రజులు కోరుతున్నారని ఎంత అవకావముంటే అంతవరకు ఇంటి పన్నులు తగ్గించేందుకు కృషి చస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. డ్రెయినేజీలు, సీసీరోడ్లు, కొండూరు రోడ్డులోని శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయడం కోసం నిధులు రూ.50లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. పట్టణంలో అన్నపూర్ణ క్యాంటిన్‌ ఏర్పాటు చేయడానికి రూ.30లక్షలు మంజూరు చేయడానికి తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మెన్‌ వేన్‌రెడ్డి రాజు, వైస్‌ చైర్మెన్‌ బత్తుల శ్రీశైలం, కమిషనర్‌ భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శౄఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటి పన్నులు తగ్గించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి
మున్సిపాలిటీకి సంబంధించిన ఇంటి పనులు తగ్గించాలని, ద్విచక్రవాహనదారులపై పోలీసులు వేస్తున్న చలాన్లను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఏక గ్రీవంగా తీర్మానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడంతో సీపీఐ(ఎం) నాయకులు పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్యదర్శి బండారు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్‌ గోపగోని లక్ష్మణ్‌, కౌన్సిలర్‌ దండ హిమబిందు అరుణ్‌కుమార్‌, నాయకులు బత్తుల దాసు, మంటిపల్లి మల్లేశం, శ్రీనివాస్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.