– సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
కార్మిక వర్గ పోరాటాలకు దిక్సూచిగా సీఐటీయూ ఉందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అన్నారు. సీఐటీయూఆవిర్భవించి 53 ఏండ్లుపూర్తైన సందర్భంగా మంగళవారం పట్టణంలోని కొబ్బరికాయల హమాలీ యూనియన్ జెండా ఆవిష్కరణ చేసి స్వీట్స్ తినిపించుకొని కార్మికులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1970 మే 27 నుండి 30 వరకు కలకత్తాలో మహాసభలు నిర్వహించుకుని మే 30న సంఘం ఏర్పాటు అయిందని తెలిపారు. సంఘం ఆవిర్భవించిన 53 సంవత్సరాలలో కార్మికుల తరుపున అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. దేశంలో సుదీర్ఘంగా సాగిన రైల్వే కార్మికుల సమ్మె మొదలు కొని నేటివరకు అనేక పోరాటాలలో ముందుండి పొరాడిందన్నారు. నేడు బీజేపీి అధికారంలోకి వచ్చిన నుండి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని,కార్మికులు కష్టపడి పనిచేసిన కనీసం కుటుంబం గడిచే పరిస్థితి లేదని కార్మికులు పోరాటాలలోకి రాకుండా ఉండడం కోసం కార్మికుల మధ్య అనైక్యత తీసుకురావడం కోసం మతోన్మాదం ముందుకు తీసుకువస్తుందన్నారు. బిజెపి మతోన్మాద విధానాలకు,కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బురి పోషెట్టి,యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు కంబాల స్వామి,చుక్కల వెంకటేశం,నాయకులు శ్రీశైలం,వెంకట్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : కార్మిక వర్గ పోరాటాలకు దిక్సూచిగా సిఐటియు ఉందని ఆ స్పూర్తితో హక్కుల సాధన కోసం కార్మిక ఐక్య పోరాటాలకు కార్మికులు సిద్దం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం అన్నారు. మంగళవారం సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని,కార్మికులు కష్టపడి పనిచేసిన కనీసం కుటుంబం గడిచే పరిస్థితి లేదని కార్మికులు పోరాటాలలోకి రాకుండా ఉండడం కోసం కార్మికుల మధ్య అనైక్యత తీసుకురావడం కోసం మతోన్మాదం ముందుకు తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు మాయ కృష్ణ, భోడ భాగ్య, గడ్డం ఈశ్వర్,నాయకులు బాబు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సీఐటీయూరాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.పాషా తెలిపారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో, మండల పరిధిలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 1970లో సీఐటీయూ ఏర్పడిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల పక్షాన సీఐటీయూ పోరాటాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, కలకుంట్ల శివ, చింతపల్లి రంగారెడ్డి, అమరేందర్ లచ్చునాయక్, మైసయ్య, రాములు,పెంటయ్య పాల్గొన్నారు.