సెపక్ తక్రా బాలికల జట్టు కెప్టెన్ గా లాస్య ప్రియ

నవతెలంగాణ – మోపాల్

25 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు కర్ణాటక రాష్టం లోని ధవనగిరి లో జరిగే 26 వ సెపక్ తక్రా సబ్ జూనియర్ టోర్నమెంట్ కు జిల్లాకు చేందిన లాస్య ప్రియా కెప్టెన్ వ్యవరిస్తున్నారని జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాధరి సంజీవరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆదివారం రాష్ట్ర జట్టు కు ప్రతినిత్యం వహిస్తున్న క్రీడాకారులకు కిట్టు పంపిణి చేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ ఎస్ అర్ ప్రేమ్ రాజ్,హైదరాబాద్ సెపక్ తక్రా అధ్యక్షులు సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గదారిసంజీవరెడ్డి పాల్గొన్నారు. నిజామాబాదు జిల్లా కు చేందిన ఆరుగురు క్రీడాకారులు రాష్ట్ర జాట్లకు ప్రతినిత్యం వహిస్తున్నారు. జిల్లా క్రీడాకారిణి రాష్ట్ర సబ్ జూనియర్ జట్టు కు కెప్టెన్ గా ఎంపిక పట్ల జిల్లా అధ్యక్షులు కేశ వేణు, ఉపాధ్యక్షులు దీపిక, ల్యాబ్ గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శి మీసాల ప్రశాంత్ కుమార్ పలు క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.