
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నారులు, మహిళలు, యువకులు హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. మండలంలోని బషీరాబాద్ లో మాజీ సర్పంచ్ సక్కారం అశోక్ గ్రామ యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.