కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం

– సన్మానించిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ కేంద్రం ఆకాంక్ష ప్లేవే స్కూల్లో ఆదివారం మండల జాతీయ స్థాయికబడ్డీ క్రీడాకారులైన ఎస్కె అయేషా, ఎండి ఆపషా, ఆవుల కార్తీక్,లను ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్  ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈసందర్బంగా అయన మాట్లాడుతూ సాగర్ నియోజకవర్గం లో  కబడ్డీ క్రీడాకారులకు ఎల్లప్పుడు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులను క్రీడల్లో,విద్యలో కూడా బాగా రాణించి  జిల్లాకు,రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుక రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఎడవల్లి రాంబాబు,చనగల ఎల్లయ్య, పిఈటిలు కాకునూరి రమేష్ గౌడ్, అనుముల మండల వ్యాయామ సంఘం అధ్యక్ష కార్యదర్శులు  శివాజీ, మంగ్య నాయక్, కబడ్డీ కోచ్ ఎండి అన్వర్,పిఈటిలు అనిల్,లింగస్వామి,సతీష్,రాము,నరేష్,రాజేష్,తదితరులు పాల్గొన్నారు.