చీలాపూర్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని చీలాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అదివారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు ఊరేగింపుగా వేళ్లి గ్రామ దేవత పోచమ్మ ఆలయం వద్ద ప్రజలు అయురారోగ్యాలతో జీవనం సాగిస్తూ,రైతులు సాగుచేసిన పంటలతో ఆశించిన దిగుబడులను సాదించి పురోగతి సాధించాలని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో  గౌడ సంఘ కుటుంబాలు పాల్గొన్నారు.
భక్తులపై తేనేటీగల దాడి..
పోచమ్మ ఆలయంలో భక్తులు బోనాలతో మొక్కులు చెల్లింపులు చేసే క్రమంలో తేనేటీగలు దాడి చేశాయి. పలువురు భక్తులు తేనేటీగల దాడికి గురవ్వగా బాధితులను గ్రామస్తులు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.