అందెశ్రీ దంపతులకు సీఎం సత్కారం

అందెశ్రీ దంపతులకు సీఎం సత్కారంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి శీ రేవంత్‌రెడ్డి దంపతులు సన్మానించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ అవార్డు గ్రహీతలు అందె భాస్కర్‌ (డప్పు వాయిద్యం), పేరిణి రాజ్‌కుమార్‌ నాయక్‌ (పేరిణి నత్యం) ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. మరో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.