– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– భగత్ సింగ్‌కు ఘన నివాళి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మెరుగైన భారత నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుతు, అమరవీరులు షహిద్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్థంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఘనంగా నివాళి అర్పించింది. ఈమేరకు సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఎకె గోపాలన్ భవన్)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలేని నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకునేందుకు, దేశ ప్రజలందరూ సమానమైన, దోపిడీ రహిత సమాజంలో గౌరవప్రదమైనగొప్పవని, ఆయన ఆలోచనలు విద్యార్థులు అనుసరిస్తూనే సమాజంలోకి పోవడానికి కృషి చేయాలన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతిని విద్యార్థుల్లోకి తీసుకెళ్లుతున్న ఎస్‌ఎఫ్‌ఐ-డీవైఎఫ్‌ఐను అభినందించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని పక్కదోవ పట్టించే అంశాలపై నేటి యువత కేంద్రీకరిస్తూ కుటుంబం, దేశం గురించి ఆలోచించడం లేదన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉంటూ దేశం కోసం యువత ఆలోచించాలన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. యువకులు భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకొని సమస్యలపై పోరాడాలని సూచించారు. భగత్‌సింగ్ పేరుతో యువజనోత్సవాలు నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ-డీివైఎఫ్‌ఐ పాత్ర ఆద్వితీయం అని కొనియాడారు. ప్రతేడాది ఇలానే యువజన ఉత్సవాలు నిర్వహించి విద్యార్ధులు, యువతలో చైతన్య నింపాలని కోరారు.
అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగరాజు, వెంకటేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజుగురు, సుఖ్‌దేవ్ 93వ వర్ధంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామన్నారు. నేటి సమాజంలో భగత్‌సింగ్ ఆలోచన విధానం చాలా అవసరమని తెలిపారు. భగత్ సింగ్ తన చిన్నతనం నుండే జాతీయోద్యమంలో పాల్గొని, సమాజంలోని అసమానతలు, మత విద్వేషాలు, వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తుచేశారు. అలాంటి అమరవీరుల అశయాలకు అనుగుణంగా నేడు యువత కూడా పోరాడాలని తెలిపారు.
కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పవిత్ర, జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్, వీరేందర్, కవిత, నాయకులు అభిమన్యు, విగేష్, చరణ్ శ్రీ, అజరు, శివ గణేష్, దాసు, సాయి, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.