దేశం చూసిన అతిపెద్ద కుంభకోణం

Seen the country Biggest scandal– ఎన్నికల బాండ్లపై కేరళ సీఎం విమర్శ
కన్నూర్‌: ఎన్నికల బాండ్లు దేశం చూసిన అతిపెద్ద కుంభకోణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. కన్నూర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో సీపీఐ(ఎం) పిటిషన్‌ వేసిందని, దీంతోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ఆ సమాచారాన్ని దాచిపెట్టేందుకు కేంద్రం చాలా ప్రయత్నాలు చేసిందని, ఇందులో భాగంగానే దేశం దృష్టిని మరల్చిందేకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని అన్నారు. ‘మన దేశం ఎటు పోతోంది. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు నిర్బంధంలో ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేస్తామనే వైఖరిలో ఉంది’ అని విమర్శించారు.