సీఐటీయూ ఆవిర్భావ స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించాలి

నవతెలంగాణ-పాలకుర్తి రూరల్‌
సీఐటీయూ ఆవిర్భావ స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించాలని జిల్లా సహా య కార్యదర్శి చిట్యాల సోమన్న అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ కార్మికవర్గ ఐక్యతను విచ్చిన్నం చేసే మతతత్వ శక్తులను ఓడించాలని అన్నారు. అన్ని రకాల దోపిడీ అణ చివేతలను అంతం చేయాలనే లక్ష్యంతో కార్మిక వర్గం శ్రమజీవుల అందరిని ఏకం చేయాలని లక్ష్యం కోసం సీఐటీయూ పనిచేస్తుందన్నారు.కార్మికవర్గ ఐక్యతే ధ్యేయం గా అలుపెరగని పోరాటాలు చేస్తూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కార్మికుల పక్షా న కార్మికుల హక్కుల కోసం ముందుకు సాగుతుందన్నారు. మతోన్మాద ఏ జెండా తో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం దళితులు, గిరిజనులు, మహిళలపై అ ణిచివేత దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, గోసంరక్షణ సాకుతో ముస్లిం, మైనారిటీల పై దాడులు చేస్తు కార్మికవర్గ ఐక్యతకు విఘాతం కల్పిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు సవరణలు చేస్తూ పెట్టుబడిదారులకు బహుళ జాతి కంపెనీల పారిశ్రామికవేత్తలకు, యాజమాన్యాలకు అనుకూల చట్టాలు తీస్తు న్నారని తీవ్రంగా మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో అంబటి సోమయ్య, షేర్‌ సోమ య్య, షేరు సమ్మయ్య, ఆంజనేయులు, బి.యాకయ్య, ఎండి.మైబు,నాగన్న, గుంశ, అబ్బాస్‌, పరమేష్‌, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్‌ : కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్‌ ,ఎన్టీఆర్‌ నగర్లో సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి, జల్లే జయరాజ్‌ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజ్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం ముందుండి వారి హక్కులు సాధించడంలో ముందంజలో ఉం టుందని, కార్మికులు ,పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను నట్టేట ముంచే నల్ల చట్టా లను తెచ్చి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలించే విధంగా బిజెపి ప్రభుత్వం కొమ్ము కా స్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర ధరలుపెంచి ప్రజలను ఇ బ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇప్పటికైనా పెంచిన నిత్యవసర ధరలు తగ్గించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనియెడల వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణ పాఠం చెప్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వాయి రవికుమార్‌, సోమారపు ప్రశాంత్‌ పోలెపాక రమేష్‌, బానోతు రాము, సోమారపు సామ్యూల్‌, పాల్వాయి జయమ్మ శిరస్సు అం జమ్మ, బాదావత్‌ శాంతి సోమారపు మౌనిక, జాషువా సోమారపు ముత్తమ్మ, విక్టర్‌ పాల్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.