ఎలక్టోరల్‌ బాండ్స్‌ : ఏపీలో ఎవరి కెంత?

Electoral Bonds: Who owns how much in AP?న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో కంపెనీల నుండి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నిధులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇచ్చిన వివరాలను, కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పొందిపరిచిన వివరాల ప్రకారంఅధికారంలో ఉన్న వైసిపికి అత్యధికంగా 337కోట్ల రూపాయలను కంపెనీలు ఇవ్వగా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి 218.88 కోట్ల రూపాయలు అందాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనసేనకు 21 కోట్ల రూపాయలను కంపెనీలు ఇచ్చాయి. వైసిపి ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున లబ్ధిపొందిందని టిడిపి పదేపదే ఆరోపించిన షిర్థిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ తనపై ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీకే ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో నిధులు అందిచడం విశేషం. ఆ సంస్థ నుండి టిడిపి 40 కోట్ల రూపాయలు అందాయి. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న మేఘా సంస్థ వైసిపి, టిడిపి, జనసేన మూడు పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో నిధులు ఇచ్చింది. బిజెపికి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన ప్యూచర్‌ గేమింగ్‌ సంస్థ రాష్ట్రంలో వైసిపికి 154 కోట్ల రూపాయలు అందించింది. అదానికి చెందిన గ్రీన్‌ కో విండ్‌ నుండి కూడా వైసిపికి 10 కోట్ల రూపాయలు అందాయి, వైసిపికి 472 బాండ్ల రూపంలో, టిడిపికి 279 బాండ్ల రూపంలో. జనసేనకు 39 బాండ్లతో ఈ నిధులు సమకూరనాయి.
టిడిపికి ఇలా…
టిడిపికి 279 బాండ్ల రూపంలో రూ.218 కోట్లు విరాళాలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 2019 ఏప్రిల్‌లో 19 బాండ్లు రూపంలో రూ.7.30 కోట్ల విరాళాలు వచ్చాయి. రూ.ఒక కోటి కంటే తక్కువ విరాళాలు వచ్చినవి 32 ఎంట్రీలు ఉన్నాయి. బిజెపి ఎంపి సిఎం రమేష్‌ కంపెనీ రిత్విక్‌ ప్రాజెక్టు నుంచి టిడిపికి విరాళాలు అందాయి.
కంపెనీ మొత్తం (రూ.కోట్లలో)
1 షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌ 40
2.. మేఘా 28
3. వెస్టర్న్‌ యుపి పవర 20
4. నాట్కో ఫార్మా 14
5. డాక్టర్‌ రెడ్డీస్‌ 13
6. భారత్‌ బయోటెక్‌ 10
7. బయోవెట్‌ 5
8. సిఆర్‌ అసోసియేట్స్‌ 5
9. చిరాన్‌ బెహ్రింగ్‌ వ్యాక్సిన్స్‌ 5
10. ఎన్‌ఎఆర్‌ ఇన్‌ఫ్రా 5
11. ట్రైడెంట్‌ కెంఫార్‌ లిమిటెడ్‌ 5
12. రాంకో సిమెంట్స్‌ 5
13. ఆర్సీసి నూట్రాఫిల్‌ 5
14. రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ 5
15. ఎస్‌ఇపిసి పవర్‌ రూ. 5
16. మాత ప్రాజెక్ట్స్‌ రూ. 5
కంపెనీ మొత్తం (రూ.కోట్లలో)
17. శ్రీచైతన్య స్టూడెంట్‌ ఫెసిలిటీ 5
18. కంచర్ల సుధాకర్‌ 5
19. గ్రాన్యుల్స్‌ ఇండియా 3
20. అరవిందో ఫార్మా 2.5
21. టెక్రియంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2
22. ఎఐసి విఎంఆర్‌ 2
23. ఎఫిసెన్స్‌ సాఫ్టువేర్‌ 2
24. క్రుతి వెంచర్స్‌ 2
25. అమరావతి టెక్‌ సిస్టమ్స్‌ 2
26. ఎస్‌ఎల్‌ఆర్వీ 2
27. సోమశిల సోలార్‌ పవర్‌ 2
28. విహాన్‌ ఆటో వెంచర్స్‌ 2
29. స్లిక్‌ సాఫ్ట్‌వేర్‌ 1
30. శ్రీరాయలసీమ హై స్ట్రెంత్‌ హైపో 1
31. శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్‌ 1
32. సాగర్‌ సిమెంట్స్‌ 50
జనసేనకు వచ్చిన విరాళాలు
జనసేనకు 39 బాండ్లతో రూ.21 కోట్లు వచ్చాయి. జనసేనకు ఒకే కంపెనీ నుంచి రూ.10 కోట్లు అందాయి.
కంపెనీ మొత్తం (రూ.కోట్లలో)
1. వెస్ట్రన్‌ యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ 10
2. నాట్కో ఫార్మా 5
3. మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ 4
4. శ్రీ చైతన్య స్టూడెంట్స్‌ ఫెసిలిటీ
మేనేజ్‌మెంటు ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1
5. వల్లూరిపల్లి ప్రభు కిశోర్‌- 1
వైసిపికి ఇచ్చిన కంపెనీలు
వైసిపికి 472 బాండ్ల రూపంలో రూ.337 కోట్లు విరాళాలు వచ్చాయి. అలాగే గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి 24 బాండ్లు వచ్చాయి. అవన్నీ ఏప్రిల్‌ 2019లో కొనగా, గుర్తు తెలియని బాండ్ల నుంచి రూ.8.25 కోట్లు వచ్చాయి. కోటి కంటే తక్కువ విరాళాలు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు 124 ఎంట్రీలు ఉన్నాయి.
సంస్థ మొత్తం (రూ.కోట్లలో)
1. ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌
హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీ 154
2. మేఘా 37
3. రామ్‌కో 24
4. స్నేహ కైనెటిక్‌ పవర్‌ 10
5. గ్రీన్‌ కో విండ్‌ 10
6. స్కీరాన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ 7
7. ఫ్యూచరిస్టిక్‌ హ్యాండ్లింగ్‌ 5
8. ఎవర్‌ షైన్‌ ఇంటీరియర్స్‌ చెన్నై 5
9. తానోత్‌ విండ్‌ పవర్‌, తాడాస్‌ విండ్‌ ఎనర్జీ 4
10. నాట్కో ఫార్మా 3
11. ఎస్‌ఇఐ డైమండ్స్‌, ఎస్‌ఇఐ ఆరుషి 3
12.. యాక్సిస్‌ విండ్‌ 3
13. దివ్యేశ్‌ పవర్‌ 3
14. ఎలెనా రెన్యువబుల్‌ 3
15. ఖండ్కే విండ్‌ ఎనర్జీ 2
16. ఆరిష్‌ సోలార్‌ 2
17. అనిమల విండ్‌ 2
18. దేవర విండ 2
19. సేన్‌ గుప్త అండ్‌ సేన్‌ గుప్త కంపెనీ 1.40
20. హిమాలయన్‌ ఎండీవర్‌ 1.40
21. శ్రేయస్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ 1
22 ఆష్మాన్‌ ఎనర్జీ 1
23.. అచింత్య సోలార్‌ 1