50 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి

50 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి– పీఆర్సీ కమిటీకి జీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగులకు కనీస వేతనం రూ.35 వేలు నిర్ణయిస్తూ 50 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని గవర్నమెంట్‌ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (జీజేఎల్‌ఏ) తెలంగాణ కోరింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ చైర్మెన్‌ శివశంకర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డి కలిసి ప్రతిపాదనలను సమర్పించారు. జూనియర్‌ లెక్చరర్‌ పేరును లెక్చరర్‌ ఇన్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌గా మార్చాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం, మున్సిపాల్టీల్లో 18 శాతం, జిల్లా కేంద్రాల్లో 20 శాతం, జీహెచ్‌ఎంసీ పరిధిలో 27 శాతం ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) చెల్లించాలని తెలిపారు. గ్రాట్యూటీ రూ.25 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం 5/10/15/20/25గా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్‌ను చెల్లించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు సమగ్ర విద్యాభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.